నవతెలంగాణ-హైదరాబాద్: లోక్‌పాల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ సెటెర్లు వేశారు. అది లోక్‌పాల్ కాదని సోకులపాల్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల ఖరీదైన BMW 330 సిరీస్ కార్లు కొనుగోలుకు లోక్‌పాల్ టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ప్రతిపక్షపార్టీలు లోక్ పాల్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అన్నాహాజారే, అర్వంద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. RSS దాని అనుబంధ సంస్థలు 2012-13 ఏడాదిలో భారీ ఎత్తున ప్రచారాలు కల్పించారు. కానీ లోక్‌పాల్ తీరును చూస్తుంటే..లోక్‌పాల్ ఎక్కడ దర్యాప్తు చేస్తుంది, ఎవర్నీ అరెస్టు చేసిందని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. అవినీతిని కట్టడి చేసి లోక్ పాల్ ప్రస్తుతం సోకుల పాల్‌గా మారిందని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
లోక్‌పాల్‌పై ఎంపీ జైరాం రమేష్ సెటెర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES