Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంరెండో రోజు సిట్ క‌స్టిడిలో ఎంపీ మిథున్‌రెడ్డి

రెండో రోజు సిట్ క‌స్టిడిలో ఎంపీ మిథున్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రెండో రోజు సిట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి ఆయనను విజయవాడకు తరలించారు. శనివారం సాయంత్రం విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. ఇక మిథున్‌రెడ్డి తొలిరోజు విచారణ 4 గంటల్లోనే ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిథున్‌రెడ్డిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు తొలిరోజైన శుక్రవారం 50 కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -