Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్లారీ ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ..

లారీ ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ..

- Advertisement -

ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ..
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): మండలంలోని ఇసుక లారీల ఘటనలతో నిరుపేద కుటుంబాలు అనాథలుగా మారుతున్నారని, ఈ ఘటనలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం కాటారం మండలంలో పర్యటించి, ఇటీవల ధన్వాడలో జరిగిన విషాద ఘటనపై స్పందించారు. ఈ నెల 8వ తేదీ ఇసుక లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందిన తుల్సే గారి రాజలింగు కుటుంబ సభ్యులను ఎంపీ వ్యక్తిగతంగా కలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. హమాలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న రాజలింగు ఆకస్మిక మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా, న్యాయపరంగా ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనల్లో బాధిత కుటుంబాలు అనాథలుగా మిగలకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే, కాటారం సబ్ స్టేషన్ పల్లికి చెందిన తోట రవి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాళ్ళు కోల్పోయిన ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా మెరుగైన వైద్యం, ప్రభుత్వ సహాయం అందేలా చూడనున్నట్లు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -