నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలములోని బస్వాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇండ్ల పనులు ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహంలో మంజూరైన గృహ నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి త్వరలో పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అదేవిధంగా నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి మూడు విడతలుగా వారి ఖాతాలోని డబ్బులు గ్రీన్ ఛానల్ ద్వారా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరు నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే వాటికి బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో, ఎంపీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES