Thursday, September 18, 2025
E-PAPER
Homeవరంగల్నాటిన మొక్కలను పరిశీలించిన ఎంపిడిఓ,ఎపిఓ

నాటిన మొక్కలను పరిశీలించిన ఎంపిడిఓ,ఎపిఓ

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్‌రావు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో ఉపాధిహామీ పథకంలో గత రెండు నెలల క్రితం పారెస్ట్,పంట పొలాల గట్లపై,చేనుల్లో నాటిన జమాయిల్ తదితర మొక్కలను బుధవారం మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి,ఎపిఓ హరీష్ పరిశీలించారు.నాటిన మొక్కల్లో ఎన్ని బతికి ఉన్నాయి,ఎన్ని చనిపోయాయని అరా తీశారు.చనిపోయిన మొక్కలకు కూడా బిల్లులు చేసే ప్రయత్నం ఉపాది సిబ్బంది చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో నేరుగా మోకాపై వెళ్లి మొక్కలు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. మండలంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 1.80 లక్షల మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని లక్ష్యం విధించారు. కానీ మొదటి విడతలో 63,750 మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసి మొక్కలు నాటారు.అందులో ఎన్ని బతికి ఉన్నాయో..?ఎన్ని చనిపోయాయో.?అధికారుల లెక్కల్లో తేలాల్సి ఉంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -