నవతెలంగాణ – జుక్కల్ : గ్రామపంచాయతీ పడంపల్లి గ్రామంలో గురువారం హరిత వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి జుక్కల్ మండలం ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిలొ ఒక్కొక్క వ్యక్తికి 6 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెట్లకు మనకు పెంచితే మనల్ని చెట్టు పరిరక్షణ చేస్తుందని , ప్రాణాన్ని కాపాడుతుందని తెలిపారు.
చెట్లను నరకడం వంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయవద్దని కోరారు. చెట్లను నొరికితే అవి చెట్ట రీత్యా నేరమని అన్నారు. చెట్లు ఉంటేనే వర్షాలు బాగా పడతాయి. అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నారు. తద్వారా మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. వనమోహత్సవ కార్యక్రమంలో ఇచ్చిన మొక్కలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకొని మొక్కల సంరక్షణ తమ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. అప్పుడే పర్యావరణ పరిరక్షణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు గ్రామంలో నిర్వహిస్తున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించడం జరిగింది. గ్రామపంచాయతీకి సంబంధించిన మినీ ట్రాక్టర్లు ఎంపీడీవో ట్రాలీలో నింపుకొని మొక్కలు నాటే ప్రాంతం వరకు ట్రాక్టర్ ను సరదాగా నడిపారు. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను పరీశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మీరే వార్ గంగాధర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యకాంత్, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
ట్రాక్టర్ పై మొక్కలు పంపిణీ చేసిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES