నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌటుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. గతంలో సీఎం కప్ క్రీడలు నిర్వహించిన సమయంలో క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మెమొంటోలు, షీల్డ్ లను బహుకరించడానికి అయినా ఖర్చును మొత్తం ఎస్ఐ అనిల్ రెడ్డి సొంతంగా భరించారు. అయితే ఆనాటి సీఎం కప్ ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎస్ఐ విధుల్లో భాగంగా వేరే ఊరికి వెళ్లడంతో హాజరు కాలేకపోయారు.
బహుమతులను స్పాన్సర్ షిప్ చేసిన ఆయనకు అభినందనలు తెలిపే అవకాశం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ కు రాలేదు. అయితే బుధవారం చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇదే వేదికపై ఎస్ఐ అనిల్ రెడ్డిని సీఎం కప్ మెమొంటోలు, షీల్డ్ లను స్పాన్సర్ షిప్ చేసినందుకు అభినందిస్తూ శాలువాతో ఎంపీడీవో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, మండలంలోని పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐ అనిల్ రెడ్డిని సత్కరించిన ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES