Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలూర్, గగుపల్లిలో నర్సరీలు, ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ఎంపీడీఓ గంగాధర్

ఆలూర్, గగుపల్లిలో నర్సరీలు, ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ఎంపీడీఓ గంగాధర్

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్ : మండల కేంద్రంలో గగుపల్లి గ్రామంలో ఎంపీడీఓ గంగాధర్ బుధవారం  నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణ, నీటి సౌకర్యాలు, నిర్వహణ విధానాలను ఆయన  పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.  గగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ, పనులు వేగంగా  నాణ్యతతో పూర్తి చేయాలని లబ్ధిదారులు, అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.

తదుపరి గగుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామానికి సంబంధించిన వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, అభివృద్ధి పనులను నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజలింగం, కిషోర్, ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, గగుపల్లి సర్పంచ్ కొండ్ర నడిపి గంగాధర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -