నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామం లో పలువురు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు జరిగింది. మంగళవారం నాడు చుక్కలు ఎంపీడీవో బస్వపూర్ గ్రామాన్ని సందర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మించు కుంటున్న లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి పలు సూచనలు చేశారు. గ్రామంలో కొత్తగా నిర్మాణం చేస్తున్న లబ్ధిదారులకు ముగ్గు వేసి డబుల్ బెడ్ రూమ్ ఇంటి పనులను ఎంపీడీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు దశలవారీగా అవుతాయని ఎవ్వరు చింతించవలసిన అవసరం లేదని , ఎంపీడీవో డబుల్ బెడ్ రూమ్ రానీ వారికి సూచించారు. త్వరలో ఇంకా మిగిలి న వారి దించడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. అంతకుముందు గ్రామపంచాయతీలోని పలు రికార్డ్ లను పరిశీలించారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో త పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి భరద్వాజ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు సూచనలు చేసిన ఎంపీడీవో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES