నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ పథకంలో భాగంగా గుర్తించిన లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కొరకు బుధవారం గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో ముగ్గు వేసి నిర్మాణాలను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, కాంగ్రెస్ నాయకులు రమేష్ దేశాయి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ గృహ పథకం నిర్మాణాలను చేపడుతున్నదని, ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కొరకు లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేయడం జరుగిందని తెలిపారు. గ్రామాలలో గుడిసెలు లేకుండా అన్ని బంగ్లా ఇల్లు ఉండాలని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలాష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ , కాంగ్రెస్ నాయకులు రమేష్ దేశాయ్ , జిపి కార్యదర్శి , గ్రామ పెద్దలు , గృహ నిర్మాణ లబ్ధిదారులు , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేమ్రాజ్ కల్లాలిలో ముగ్గుపోసి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES