Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్10వ తరగతి ప్రత్యేక శిక్షణా తరగతులను పరిశీలించిన ఎంపీడీవో

10వ తరగతి ప్రత్యేక శిక్షణా తరగతులను పరిశీలించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నిత్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తుంది. సోమవారం జుక్కల్ ఎంపీడీవో పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్టుల వివరాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ లక్ష్యాలను చేరుకోవాలంటే ధైర్య సాహసాలతో చదవాలని క్రమశిక్షణ ఉంటే విజయం మీ వెంటే ఉంటుందని అన్నారు.

పరీక్షలు రాసే సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. సాయంకాలం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి ప్రత్యేక క్లాసులు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మీకందరికీ స్నాక్స్ ఇచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు 100% ఉత్తీర్ణత వచ్చే విధంగా కృషి  బోధన చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఎంపీడీవో తో పాటు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, ఉపాధ్యాయులు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -