Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఆలూరులో కూలిన ఇల్లు.. పరిశీలించిన ఎంపీడీఓ

ఆలూరులో కూలిన ఇల్లు.. పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ గంగాధర్ శనివారం విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో ఒక ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తరలించి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మండలంలోని చెరువులు, కుంటలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వాటి కట్టలను స్వయంగా పరిశీలించిన ఎంపీడీఓ, గ్రామస్థులను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో వసతి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ .. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న సమయంలో వాటి వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పడిపోయిన విద్యుత్ తీగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర కావద్దని, అలాగే పాత కట్టడాలు, పాడుబడిన గోడల నుండి దూరంగా ఉండాలని సూచించారు. అలాంటి సందర్భాల్లో వెంటనే గ్రామపంచాయతీ అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలో తగిన సౌకర్యాలు కల్పించినట్లు ఎంపీడీఓ  తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad