Thursday, July 31, 2025
E-PAPER
Homeజిల్లాలుఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గుండూరు గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజురై ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ .. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజురైన ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. తమతమ ఇండ్లను గడువు లోగా పూర్తి చేయాలని సూచించారు. త్వరితగతి నా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్న వారికి బిల్లులవి గ్రీన్ ఛానల్ ద్వారా పరిశీలించి డబ్బులను  లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటి నిర్మాణాలను ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేయాలని లేకుంటే నిర్మించుకున్న డబ్బులు చెల్లించవలెనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -