నవతెలంగాణ- జుక్కల్
మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. ఇష్టం వచ్చినట్టు ఇందిరమ్మ పథకంలో ఇంటి నిర్మాణాలు చేస్తే నిబంధనలు ఒప్పుకోవని వాటికి ఇంటికి సంబంధించిన రుణాలు మంజూరు చేయడం జరగదని కరాకండిగా లబ్ధిదారులకు తెలియజేశారు. నిర్మాణాలు చేపడుతున్న వాటిని వీలైనంత త్వరత్వరగా నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. నిర్మాణం పూర్తి అయితే డబ్బులు మూడు విడతలుగ లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా ప్రభుత్వమే జమ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఇందిరమ్మ పథకం మంజీరైన లబ్ధిదారులు , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES