నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన ఇంటి నిర్మాణాలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ముగ్గు వేసి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలోని పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. అనంతరం బస్వాపూర్ , మరియు కంటాలి జిపి గ్రామంలోని ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి కూలీలకు తగు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. అటవీ ప్రాంతంలో పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలు జాగ్రత్తగా పనులు నిర్వహించాలని మండలంలో పలు గ్రామాలలో పులి సంచారం చేస్తున్నదని తగు జాగ్రత్తలు పాటించాలని ఎఫ్ఏకు మరియు కూలీలకు ఆదేశించారు.
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి జిపి గ్రామంలో గ్రామ కార్యదర్శి జీవన్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహంచడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాల్గొని గ్రామ అభివృద్ధి గురించి పలు సూచనలు చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని గ్రామస్తులు తమకు సహకరించాలని అన్నారు. ముఖ్యంగా గ్రామంలో శానిటేషన్ నిర్వహణ , నీటి ఎద్దడి సమస్యలు మొదటగా తీర్చడం జరుగుతుందని గ్రామసభలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.



