నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామపంచాయతీ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల ఇండ్లను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ జిపి కార్యదర్శి అనురాధ తో కలిసి నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను సరిత వ్యతిన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్న వారు సమస్యలుంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి విన్నవించాలని తెలిపారు. సమస్యలకు సలహాలు సూచనలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు మూడు పర్యాయాలు బిల్లులను వారి ఖాతాలోని జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు జిపి కార్యదర్శి , ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
లుంగన్ లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES