నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బస్వపూర్ గ్రామంలో ఇందిరమ్మ గ్రహాలని జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ శుక్రవారం నాడు సందర్శించి జిపి కార్యదర్శి నాగయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ లబ్ధిదారులకు వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మా ద్వారా మీకు ఏమైనా అవసరం ఉందా ? ఏమైనా సమస్యలు ఉటే ఇక్కడే తెలియజేయాలని ఎంపీడీవో లబ్ధిదారులకు కోరారు. ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు త్వరిత గతిన ఇంటి నిర్మాణాలు చేపట్టి గృహప్రవేశాలు చేసుకోవాలని అన్నారు. శుభకార్యానికి మండల స్థాయి అధికారులను అందరికీ తప్పకుండా పిలవాలని లబ్ధిదారులను కోరారు. బిల్లుల చెల్లింపులు ఏమైనా సమస్యలు ఉంటే తమకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మధ్యవర్తులు, ఆశా చూపించే వారికి, దళారులకు, నమ్మొద్దని, డబ్బులు లబ్ధిదారుల ఖాతాలోని నేరుగా జమ కావడం జరుగుతుందని లబ్ధిదారులకు ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు జిపి కార్యదర్శి నాగయ్య, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బస్వాపూర్ జిపి గ్రామంలో ఇందిరమ్మ గృహలను పరిశీలించిన ఎంపీడీవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES