నవతెలంగాణ – జుక్కల్
ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో మంజూరైన ఇంటి లబ్ధిదారులకు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ వారికి అందుబాటులో ఉండి లబ్ధిదారులకు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో ఎంపీడీవో స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ పథకం గృహ లబ్ధిదారులకు ఎంపీడీవో సిబ్బందితో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారికి తెలియజేశారు. ఇండ్లు కట్టుకునే విధంగా పబ్దిదారులను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపిడిఓ తో పాటు మహ్మదాబాద్ గ్రామపంచాయతీ కార్యదర్శి సంజీవ రాథోడ్ మరియు గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
మహమ్మదాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -



