నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న మోడల్ హౌస్ జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , హౌసింగ్ డిప్యూటీ ఏఈ గోపాల్ సోమవారం పరిశీలించారు. అదేవిధంగా మండలంలోని బంగారు పల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఏవైనా నిర్మాణం విషయంలో , బిల్లులు రావడంలో సమస్యలు ఉంటే వాటి విషయం పైన చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో , హౌసింగ్ డిప్యూటీ ఏఈ మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహ నిర్మాణంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెను వెంటనే పనులను ప్రారంభించారని పేర్కొన్నారు. వివిధ దశలలో పనులు కొనసాగుతున్నాయని వాటిలో కొన్ని పూర్తికావస్తున్నాయని అన్నారు. త్వరలో లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారని తెలిపారు. ఇండ్లు నిర్మించుకున్న వారికి వెనువెంటనే బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులతో నిత్యం మాట్లాడుతూ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.
మోడల్ హౌసింగ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES