- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని తను వార్డులలో నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని వార్డులలో చెత్త, మురికి కాలువల శుభ్రం, నీటి ఎద్దడి తలెత్తకుండా ఎక్కడికక్కడ పరిష్కారించాలని ఆయన సూచించారు. పైప్ లైన్ లీకేజీలు ఎప్పటికప్పుడు రిపేరు చేయాలని జిపి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



