నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి పనితీరును ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకుపోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణాల దశలను బట్టి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి, నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో చేస్తుందని తెలిపారు. ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, మేస్త్రీలు కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దని సూచించారు. అంతకుముందు ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కమిటీ సభ్యులు, లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇండ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారుఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పనితీరును పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES