నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బంగారు పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం ఇంటి నిర్మాణాలను ఎంపీడీవో శ్రీనివాస్ శుక్రవారం ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. జుక్కల్ మండలంలోని బంగారు పల్లి గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాడల్ గ్రామంగా ప్రకటించారు. పథకం ప్రారంభోత్సవంలో మొదటి విడతలు వెనుకబడిన జుక్కల్ మండలాన్ని ఎంపిక చేసి బంగారు పల్లి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా గ్రామంలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ గృహ పథకంలో గృహ నిర్మాణాల కొరకు అర్హులైన లబ్ధిదారులను మండల స్థాయి అధికారులు ఎంపిక చేశారని తెలిపారు.
ఈ క్రమంలో మండలంలో మీ గ్రామంలో గృహ నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేశారని అన్నారు. ఇప్పటికే బంగారు పల్లి గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టి గృహప్రవేశాలు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జుక్కల్ ప్రాంతం ఇందిరమ్మ గృహ పథకంలో ఇంటి నిర్మాణాలను నిర్మించడంలో మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. ఈ మండలంలోని గ్రామీణ ప్రజలు ఇంటి నిర్మాణాలను నిర్మించుకోవడానికి ముందుకు రావడంతో భారీగా ఇండ్ల మంజూరు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కొరకు ముగ్గు వేసి పనులను ఎంపీడీవో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    