నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగర్ గావ్ గ్రామంలో సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి నూతనంగా ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను మార్కౌట్ వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ, సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు.
గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేస్తున్న క్రమంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమస్యను పరిష్కరించి వెంటనే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీవో సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్, జిపి కార్యవర్గ సభ్యులు, జిపి సెక్రెటరీ లింగురామ్ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



