నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సరిహద్దు సోపూర్ జిపి గ్రామంలో మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్ పలు ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు మార్కౌట్ ఇచ్చి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దంతోడే తుకారాం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర , కర్ణాటక సరిహద్దు గ్రామమైన సోపూర్ గ్రామంలో పలు ఇందిరమ్మ గృహ నిర్మాణాల పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు.
గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు నిర్మాణ పనులను ప్రారంభించాలని అన్నారు. నిర్మాణ పనులలో అంతరాయం ఏర్పడకుండా వీలైనంత త్వరలో గృహ నిర్మాణాలు పూర్తిచేసి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్, జిపి పాలకవర్గం సభ్యులు, మాజీ సర్పంచ్ సూర్నార్ శివాజీ పటేల్ , గ్రామస్తులు జాన్సన్, గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



