Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎంపీడీఓ భేటీ..

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎంపీడీఓ భేటీ..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం రాజకీయ పార్టీల నేతలతో మండల కేంద్రం లోని మండల.ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి భేటీ నిర్వహించారు. గుర్తింపు పొందిన పలు పార్టీల ప్రతినిధులు హాజరుయ్యారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆయన స్వీకరించనున్నారు. మండలం లోని 26  గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి ఇప్పటికే 19 నెలలు గడిచి పోయాయి. ఈ సమావేశంలో  ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా ఖరారు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర కీలక అంశాలపై రాజకీయ పార్టీలతో ఆమె చర్చించారు. ఓటర్ జాబితా తయారీ అనంతరం ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. 

సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను చేపట్టుకు రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు,  ఉంటాయని స్పష్టం చేశారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌ వంటి ప్రక్రియలను తక్షణమే పూర్తిచేయాలని సంబందిత అధికారులకు తెలియ జేశామని తెలిపారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్,సీపీఎం,ఎంఆర్పీ ఎస్  నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -