– చౌట్ పల్లిలో నర్సరీ పరిశీలన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని చౌట్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తుంగ కుంట చెరువుగట్టుకు మన మహోత్సవంలో భాగంగా నాటిన ఈత మొక్కల ప్లాంటేషన్ ను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. చెరువుగట్టు పైన ఉపాధి హామీ కూలీలతో కలిసి ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి పెంచితేనే మానవ మనుగడ సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. చెరువు కట్టపై, ఇతర భూముల్లో ఈత, తాటి, అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలు నాటాలన్నారు.
ఈత వనాలు నాటి సంరక్షించి వాటిని వృద్ధి చేయడం ద్వారా గౌడ కులస్తులకు పని దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా ఎంపీడీవో కోరారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన పరిశీలించారు. నర్సరీ నిర్వాహకులతో మాట్లాడి మొక్కల సంరక్షణ పై వారికి పలు సలహాలు, సూచనలు చేశారు.లక్ష్యం మేరకు వనమహోత్సవంలో భాగంగా గ్రామంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.కార్యక్రమంలో ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సాదుల్లా, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES