- Advertisement -
నవతెలంగాణ – కాటారం
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అడ్డూరి బాబు అధ్యక్షతన స్థానిక ఎలక్షన్ల నిర్వహణ పైన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించి, వారి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు వేమునురి ప్రభాకర్ రెడ్డి ,బిజెపి నుండి బండం మల్లారెడ్డి ,బిఎస్పి నుండి బొడ్డు రాజబాబు, సీపీఐ(ఎం) నుండి ఆత్కూరి శ్రీకాంత్ ,డి స్పి నుండి చిట్యాల శ్రీనివాస్ ,కొర్రల శ్యాం, ఎంపీఓ పిల్లి వీరస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -