నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో మంగళవారం జరిపి కార్యదర్శి అనురాధ అధ్యక్షతన నిర్వహించిన సెన్సస్ సర్వేను ఎంపీడీఓ శ్రీనివాస్ ఇంటింటికీ తిరిగి సర్వే చేశారని కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో 30 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో సెన్సస్ సర్వేలు ఆయా గ్రామాల జిపి కార్యదర్శులు ముమ్మురం చేశారని అన్నారు.
విధించిన గడువులోగా ఇంటింటికి తిరిగి సర్వే చేసి నివేదికలని ఎంపీడీవో కార్యాలయంలో అందించాలని కార్యదర్శులకు ఆదేశించారు. అందులో భాగంగా నేడు పలు గ్రామాలలో సందర్శన చేయడం జరిగింది అని తెలిపారు. గ్రామ కార్యదర్శులు నిర్వహించిన సర్వేలు ఏవైనా డోర్పాట్లు ఉన్నాయా అనే ఉద్దేశంతో లొంగన్ గ్రామంలోని ఇంటింటికి రావడం జరిగింది అని సర్వే వివరాలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగలగిద్దే ఉషారాణి సదు పటేల్, జీడి కార్యదర్శి, కారోబారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జరిగింది.



