నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ శనివారం సందర్శించి పరిశీలించారు. గణిత శాస్త్ర పరీక్ష జరుగుతున్న తీరును చీఫ్ సూపరింటెండెంట్ మధుపాల్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ కోసం సిబ్బంది సహకరించాలని సూచించారు. వేసవి ఎండలు ఎక్కువైనందున విద్యార్థులు దాహార్తిని తీర్చుకునేందుకు చల్లని స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. సిబ్బందితో మాట్లాడి గణిత శాస్త్ర పరీక్షకు హాజరైన విద్యార్థులకు సంఖ్య, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంటల్ అధికారి సిరిమల్ల దేవన్న, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



