-మా సమస్యలు పరిష్కరించండి :వెంకటాపూర్ గ్రామస్తుల వినూత్న నిరసన
-కేసీఆర్ వేషధారణ వ్యక్తికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-తూప్రాన్/మనోహరాబాద్
తామందరం ఓట్లేసి కేసీఆర్‌ను గెలిపించు కున్నామని, మా ఎమ్మెల్యే ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలంటూ కేసిఆర్ వేషధారణను వేసిన వ్యక్తికి వెంకటాపూర్ గ్రామ ప్రజలు వినతిపత్రాన్ని అందజేసి వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేట జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామస్తులు గురువారం కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో సీసీరోడ్లు, డ్రయినేజీలు, కరెంట్ స్తంభాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని వాటి మరమ్మత్తుల కు నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే, మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను, తూప్రాన్ రింగ్‌రోడ్డు పనులను పూర్తిచేయా లన్నారు. తూప్రాన్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐసీడీఎస్ ఏర్పాటు చేయాలని తెలిపారు. తూప్రాన్ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సమస్యలను గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
కేసీఆర్ సారూ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



