Wednesday, July 16, 2025
E-PAPER
Homeసినిమా'మిస్టర్‌ రెడ్డి' ప్రేమకథ

‘మిస్టర్‌ రెడ్డి’ ప్రేమకథ

- Advertisement -

టీఎన్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై గోల్డ్‌ మ్యాన్‌ రాజా (టి.నరసింహా రెడ్డి-టీఎన్‌ఆర్‌) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్‌ రెడ్డి’.
వెంకట్‌ వోలాద్రి దర్శకుడు. మహాదేవ్‌, అనుపమ ప్రకాష్‌, దీప్తి శ్రీరంగం, భాస్కర్‌, మల్లికార్జున్‌, శంకర్‌ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఈ మూవీని ఈనెల 18న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో, నిర్మాత టీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ,’ఎంతో తపన ఉంటేనే సినిమాలు నిర్మిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడితే గానీ ఓ మూవీ బయటకు రాదు. ఈ క్రమంలో నన్ను ఎంతో మంది మోసం చేశారు. కానీ నేను ఎప్పుడూ ఎక్కడా భయపడలేదు. నా టాలెంట్‌ను నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇది నా జీవితంలో జరిగిన కథే. ఇందులోని ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని అన్నారు.
”మిస్టర్‌ రెడ్డి’ లాంటి మంచి చిత్రాన్ని తీశాం. ఈ ప్రయాణంలో నిర్మాత, హీరో టీఎన్‌ఆర్‌ ఎంతో సహకరించారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడండి’ అని దర్శకుడు వెంకట్‌ వోలాద్రి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -