హీరో శ్రీ విష్ణు, దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘మత్యుంజరు’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినరు చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ మరోసారి ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేయనున్నారు.
ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పాటకి కూడా యూట్యూబ్‌లో ఆదరణ దక్కింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘సన్నీ (సందీప్ గుణ్ణం) నా జీవితంలో ఓ భాగం. మా 18 సంవత్సరాల స్నేహంలో సన్నీలో నేను ఎన్నో గమనించాను. సన్నీకి తన తండ్రి గుణ్ణం గంగరాజులాగే ప్రత్యేకమైన కథలను గుర్తించే స్వభావం ఉంది. ‘మత్యుంజరు’ లాంటి ఓ యూనిక్ స్క్రిప్ట్‌తో అతను తన తొలి ప్రాజెక్ట్‌గా నిర్మాణంలోకి అడుగు పెడుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ట్రైలర్ చూసి, ఎన్టీఆర్ ప్రశంసల్ని కురిపించారు. ఉత్కంఠభరితంగా ఉందని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉందని కొనియాడారు. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లోకి రానుంది అని చిత్రయూనిట్ తెలిపింది.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘మృత్యుంజయ్’
- Advertisement -
- Advertisement -



