నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ గ్రామ వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో ఆదివారం గాయత్రీ, మృత్యుంజయ మహా యజ్ఞాల్ని వైభవంగా నిర్వహించారని ధర్మ ప్రచారకుడు, కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని ఆదర్శ అంకాపూర్ గ్రామ శివారులో గల వైదిక ధ్యాన యోగ ఆశ్రమంలో 18 రోజులపాటు కొనసాగింది. తన మనసే తనకు బంధువు, శత్రువు కూడా కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలు చేసుకోకూడదు. మనసును స్వాధీన పరచుకున్న వాడికి తన మనసే బంధువు. మనస్సును జయించిన వారికి మనస్సే ప్రభల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు మానవమానాలపట్ల సమభావం కలిగి ఉంటాడు. శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి వీళ్ళందరి పట్ల సమబుద్ధి కలిగిన వారే సర్వోత్తములు. మనస్సును అదుపులో ఉంచుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సదానందరెడ్డి ఆశ్రమానికి చెందిన పాఠశాల విద్యార్థులు, నిజామాబాద్, అంకాపూర్, ఆర్మూర్, భీమ్గల్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ తదితర ప్రాంతాల నుండి పాల్గొన్నారు.
అంకాపూర్ యోగాశ్రమంలో మృత్యుంజయ మహాయజ్ఞం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



