Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకలు..

ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సోమవారం కాల్వపల్లి, కాటాపూర్ గ్రామాలలో 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కాల్వపల్లిలో గ్రామ కమిటీ అధ్యక్షులు పురుషోత్తం సుధాకర్ ఆధ్వర్యంలో, కాటాపూర్లో గ్రామ కమిటీ అధ్యక్షులు లంజపెల్లి సత్యంల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆత్మగౌరవం మాదిగ, మాదిగ ఉపకులాలకు తరతరాలుగా అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం.. జనాభా ధమాషా ప్రతిపాదిక రాజ్యాంగ బద్దంగా ఎవరి వాట వారికే దక్కే విధంగా రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో 1994 జులై 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ లో వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో స్థాపించారని అన్నారు.

అంతేకాకుండా రిజర్వేషన్లకు పాటు అనేక సామాజిక ఉద్యమాలు చేసి, పాలకుల మెడలు వంచి, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయించిన ఘనత ఎమ్మార్పీఎస్ ది అని కొనియాడారు. ఉద్యమ ప్రధాన లక్ష్యమైన రిజర్వేషన్లను అమలును ఆగస్టు ఒకటి 2024న సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మందకృష్ణ ఈ ఘనత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షు లు పురుషోత్తం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పురుషోత్త కిరణ్, మహిళా అధ్యక్షురాలు మందపల్లి జ్యోతి మాజీ మండల అధ్యక్షుడు నారాయణ కమిటీ సభ్యులు, కాటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు లంజపల్లి సత్యం, ఉపాధ్యక్షుడు కొల్లూరి రామస్వామి, కమిటీ సభ్యులు మహిళలు పుల్లూరి గౌరమ్మ, ప్రజా సంఘాల నాయకులు తోట తిరుపతయ్య, యూత్ అధ్యక్షు దిడ్డి రంజిత్, పల్లె వెంకటేశ్వర్లు ఎల్లబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -