నవతెలంగాణ – ఆర్మూర్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మార్పీఎస్ క్రియాశీలక పాత్ర.. పోషిస్తుందని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు అన్నారు. సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం, పద్మ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ 31 ఏండ్లుగా మాదిగల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు ఆరోగ్య శ్రీ, వికలాంగుల, వృద్ధుల, వితంతువుల పింఛన్ల పెంపు కోసం ఎమ్మార్పీఎస్ క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. భవిష్యత్ లో ప్రజా సమస్యలపై ఉద్యమాలను చేయడానికి ఎమ్మార్పీస్ సిద్ధంగా ఉంటుందని అన్నారు.
మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాలు అణగారిన కులాలకు స్పూర్తి నింపాయని తెలిపారు. మాదిగ జాతికి ఆత్మగౌరవం తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జాతి యావత్తు రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీస్ జిల్లా కార్యదర్శి శ్యామ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇందరపు రాజు మాదిగ, ఎమ్మార్పీస్ మండల అధ్యక్షులు రాము మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి నూతుపల్లి సంతోష్ మాదిగ ,మండల ఉపాధ్యక్షులు మంగళరాం రవి, సంకేపల్లి విప్లవ్, సంతోష్, కొక్కెర భూమన్న, రింగుల భూషణ్, తెడ్డు నర్సయ్య , మల్కన్న , నల్ల రాజారాం ,కృష్ణయ్య, పొన్నాల చంద్రశేఖర్, మాదిగ ఉద్యోగ సమాఖ్య మద్దూరి గణేష్, మైదం సుదర్శన్ ,పొన్నాల రాజన్న, గంగన్ స్వామి, మద్దూరి తరుణ్, సంకేపల్లి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మార్పీఎస్ కీలకపాత్ర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES