Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికలాంగుల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటం..

వికలాంగుల సమస్యలపై ఎమ్మార్పీఎస్ పోరాటం..

- Advertisement -

ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మాడిపల్లి శ్యాంబాబు మాదిగ
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రభుత్వం విగాలాంగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని,లేదంటే వికలాంగుల తరుపున ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఎమ్మార్సీస్ జిల్లా ఇంచార్జి మాడిపల్లి శ్యాంబాబు మాదిగ అన్నారు. మంగళవారం మండలంలోని రుద్రారం గ్రామంలో ఎమ్మార్సీస్ జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రభుత్వం వికలాంగులకు రూ.6వేలు,చేనేత కార్మికులకు రూ.4వేలు,వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు ఆసరా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు బుధవారం ఎమ్మార్సీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంథనికి వస్తున్న తరుణంలో వికలాంగులు,వృద్ధులు, వితంతువులు అధిక సంఖ్యలో తరలివచ్చి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి  ఇన్చార్జులు దుమ్ము వెంకటేశ్వర్లు,రుద్రారపు రామచంద్రం,మంద తిరుపతి మాదిగ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -