– గర్భిణీకీ రక్తదానం చేసిన శ్రీధర్ పటేల్
– జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్
నవతెలంగాణ – కామారెడ్డి
నేటి సమాజంలో అందరూ బిజీగానే ఉంటారు ఎవ్వరు ఖాళీగా లేరు కానీ మనకు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎంత బిజీగా ఉన్నా మన సమయాన్ని వారి కోసం కేటాయించాలనీ అప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుంది అని శ్రీధర్ పటేల్ అన్నారు. అత్యవసరంగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రక్తహీనత తో చికిత్స పొందుతున్న గర్భిణీ మహిళ వందన కీ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉండగా ఒక్క ఫోన్ కాల్ తో రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా రక్తదాత మాట్లాడుతూ రక్తం అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే రక్తం దానం చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానంకు ముందుండాలని జిల్లా రక్తదాత సేవా సమితి తరపున కోరుతున్నాను అని పేర్కొన్నారు. రక్తదానం చేసిన శ్రీధర్ను జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు అరవింద్ గౌడ్, శ్రీచరణ్, అనిల్ కుమార్, బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రక్తదానంలో ఆపద్బాంధవుడు ముదాం శ్రీధర్ పటేల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES