- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండల బిసి అఖిలపక్ష జేఎసి కార్యవర్గాన్ని బిసీ సంఘం సీనియర్ నాయకుడు రోళ్ళ రమెష్ ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిసి సంఘం అఖిలపక్షం జేఎసి మండల అధ్యక్షుడుగా బోయిడి అనిల్, (ముధోల్ ), ఉపాధ్యక్షుడుగా సాపేవార్ కిష్టయ్య(గన్నోర), గడ్డం సుభాష్ (ముధోల్ ) ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ ( ఆష్ట), సహాయ కార్యదర్శి రుమెల్ల జీవన్ (ముధోల్ ), సలహాదారుగా రవికిరణ్ గౌడ్ (తరోడ), మెత్రి సాయినాథ్ (ముధోల్ ), దత్తాద్రి (ఎడ్ బిడ్), కిషన్ పటేల్ (ముధోల్ ) లను ఎన్నికైనట్లు ఓక్క ప్రకటనలో తెలిపారు. మండలంలో బీసీల ఐక్యత కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తామని వారు తెలిపారు.
- Advertisement -