Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు..!

భక్తి శ్రద్ధలతో మొహర్రం వేడుకలు..!

- Advertisement -
  • – ఘనంగా పీర్ల నిమజ్జనం
    – వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు
    నవతెలంగాణ-పెద్దవూర
    మొహర్రం పండుగను పెద్దవూర పట్టణవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసదీక్షలు చేపట్టారు. మండల కేంద్రాలతోపాటు అన్ని గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రంకొత్తలూరు గ్రామం పీర్లను పురువీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు. కుల మతాలకు అతీతంగా,పిల్లలు, పెద్దలు కోలాటాలు,
    ఆటపాటలతో డప్పుచప్పుళ్ల మధ్య పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. పీర్లను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.
  • ముస్లిం సహోదరులు మసీద్‌లలో ప్రత్యేకంగా అలంకరించిన పీర్లకు ఆయా గ్రామాల్లో భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు. పలు గ్రామాల్లో రాత్రివేళ మహిళల ఆటపాటలతో బొడ్డెమ్మలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. హిందువులు, ముస్లీంలు కలిసికట్టుగా పీర్ల ఎదుట డప్పుల చప్పుడులతో ఆడిపాడిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజామున మొహర్రం వేడుకల్లో భాగంగా పీర్ల సవారీతో గ్రామ వీధుల్లోకి రాగా భక్తులు దారిపోడవునా నీరుపోసి మొక్కులు తీర్చుకున్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -