- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో మొహరం పండుగ వేడుకను హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు ఎత్తారి హనుమంతు కుటుంబ సభ్యు లైన ఎత్తారి గోపి, ఏత్తారి వెంకటరమణలు ప్రత్యేక పూజలు చేసి, గ్రంధాలు సమర్పించారు. మొహరం పండుగ నిర్వహించే మహమ్మద్ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
- Advertisement -