– టీపిసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి : ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే మోహర్రం వేడుక మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి అన్నారు. మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకొని పాలకుర్తి నియోజకవర్గ యశస్విని రెడ్డి, టిపిసిసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు బిల్లా సుధీర్ రెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పీర్ల సావర్ల ఊరేగింపులో పాల్గొనడం గొప్ప విషయం అన్నారు.
భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మలీజా, మటికలతో ఫాతెహాలు ఇచ్చి మొక్కులు తీర్చే కార్యక్రమాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. భక్తిశ్రద్ధలతో డబ్బు చప్పులతో గ్రామాల పురవీధుల్లో నిర్వహించే పీర్ల ఊరేగింపు ఆధ్యాత్మిక శోభను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మందపూరి మహేందర్, ఐరెడ్డి ఎల్లా రేడ్డి, మహమ్మద్ జలీల్, గంషావాలి,మేర యాకయ్య, వెంకన్న, కాసిం, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక మోహర్రం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES