- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే మోహర్రం వేడుక మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పీర్ల సావర్ల ఊరేగింపులో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మలీజా, మటికలతో ఫాతెహాలు ఇచ్చి మొక్కులు తీర్చే కార్యక్రమాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు.భక్తిశ్రద్ధలతో డబ్బు చప్పులతో గ్రామాల పురవీధుల్లో నిర్వహించే పీర్ల ఊరేగింపు ఆధ్యాత్మిక శోభను కళ్ళకు కట్టినట్లు చూపెడుతుందన్నారు.
- Advertisement -