Monday, February 23, 2026
E-PAPER
Homeసినిమామల్టీ లేయర్‌ స్క్రీన్‌ ప్లే..

మల్టీ లేయర్‌ స్క్రీన్‌ ప్లే..

- Advertisement -

జ్యోతి పూర్వజ్‌, పూర్వాజ్‌, లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్‌’. ధ్యానం నాన్న ఆశీస్సులతో థింక్‌ సినిమా, ఏయూ అండ్‌ ఐ స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై పూర్వాజ్‌, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్‌ పూర్వజ్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఆదివారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. లైన్‌ ప్రొడ్యూసర్‌ సీతారామరావు మాట్లాడుతూ,’సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. టీజర్‌లాగే సినిమాకు కూడా మీ సపోర్ట్‌ అందిస్తారని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ‘మంచి కంటెంట్‌ ఉన్న చిత్రమిది. బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌తో ఆకట్టుకునేలా ఉంటుంది.

ఈ చిత్రంలో నేను బ్రదర్‌ రోల్‌లో నటించాను’ అని లైన్‌ ప్రొడ్యూసర్‌ దశరథ మాధవ్‌ చెప్పారు. హీరోయిన్‌ జ్యోతి పూర్వజ్‌ మాట్లాడుతూ, ‘నేను ఆరేడు క్యారెక్టర్స్‌ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్‌ రోల్‌ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్‌లో పర్‌ఫార్మ్‌ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్‌ కైనా డ్రీమ్‌ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్‌ కూడా చేయించాడు డైరెక్టర్‌’ అని తెలిపారు. డైరెక్టర్‌ సుకు పూర్వాజ్‌ మాట్లాడుతూ,’ మేము టీజర్‌లో చెప్పినట్లు మీ మేధస్సును ఉపయోగించండి అనేది ఎందుకు చెప్పామో మూవీ చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌, ఎమోషనల్‌ డ్రామా, బ్రదర్‌ సిస్టర్‌ బాండింగ్‌, రివేంజ్‌, సబ్‌ కాన్షియస్‌ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్‌తో సైఫై థ్రిల్లర్‌గా రూపొందించాం. మల్టీలేయర్‌ స్క్రీన్‌ ప్లే ఉన్నా ప్రతి సెక్షన్‌ ఆడియెన్‌కు మూవీ ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. వుమెన్‌ సెంట్రిక్‌ చిత్రమిది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -