Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణకు మల్టీ ఓమిక్స్‌ ల్యాబ్స్‌

తెలంగాణకు మల్టీ ఓమిక్స్‌ ల్యాబ్స్‌

- Advertisement -

– ‘వీజ్జీ హౌల్డింగ్‌ ఐఎన్‌ సీ’ తో కుదిరిన ఒప్పందం
– పదేండ్లలో రూ.2500 కోట్ల పెట్టుబడులు : సీఎంతో పిట్స్‌బర్గ్‌వర్సిటీ డీన్‌ అనంతశేఖర్‌, కో ఫౌండర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి
– ఆరోగ్య రంగంలోకి వీజ్జీకి స్వాగతం : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పీ5 సొల్యూషన్‌తో మల్టీ ఓమిక్స్‌ ల్యాబ్స్‌ అప్రొచ్‌తో వైద్యరంగంలో విప్లవాన్ని సృష్ట్టిస్తోన్న యూఎస్‌ బేస్డ్‌ కంపెనీ విజ్జీ హౌల్డింగ్‌ ఐఎన్‌సీ ఇకపై తెలంగాణలో సేవలందించనుంది. ఈ మేరకు ‘తెలంగాణ రైజింగ్‌-2047’ గ్లోబల్‌ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. వీజ్జీ హౌల్డింగ్‌ ఐఎన్‌ సీ ఫౌండర్‌, సీఈవో డాక్టర్‌ విష్ణువర్థన్‌ నేతృత్వంలో ఆ సంస్థ ప్రతినిధులు పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ డీన్‌, వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ అనంత శేఖర్‌, వీజ్జీ కో ఫౌండర్‌ పీఎస్‌ కళ్యాణ్‌ చక్రవర్తి మంగళవారం గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీిలో వైద్య రంగంలో వీజ్జీ తెచ్చిన ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను విని సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, వైద్యసేవలను అందించే దిశలో వీజ్జీతో ఎంఓయూకు అంగీకారం తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో వీజ్జీ కంపెనీ ప్రతినిధులు డాక్టర్‌ అనంత శేఖర్‌, కళ్యాణ్‌ చక్రవర్తి మధ్య అవగాహనా ఒప్పందం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పీ5 సొల్యూషన్స్‌తో మల్టీ ఓమిక్స్‌ అప్రొచ్‌తో వీజ్జీ ల్యాబ్స్‌ తెలంగాణకు వస్తోందన్నారు. ఇప్పటివరకు అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ తర్వాత రెండవ ల్యాబ్‌ను తెలంగాణలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఇందుకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ ల్యాబ్స్‌ ద్వారా ఐదేండ్ల ముందు మానవ శరీరంలో రాబోయే రుగ్మతలు, ప్రాణాంతకరమైన వ్యాధులను గుర్తించవచ్చని తెలిపారు. ఈ హెల్త్‌ చెకప్‌లతో ముందుగానే కావాల్సిన వైద్యం తీసుకోవచ్చన్నారు. రాబోయే పదేండ్ల తెలంగాణలో వీజ్జీ రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ కో ఫౌండర్‌ పీసీ కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -