Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క నామకరణం చెయ్యాలి 

ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క నామకరణం చెయ్యాలి 

- Advertisement -

ముంజాల బిక్షపతి ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క జిల్లాగా నామకరణం చేయాలని ములుగు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల బిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పస్రా గ్రామంలో ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18న మేడారం మనదేవతల సమ్మక్క సారక్క సన్నిధికి వస్తున్న సందర్భంగా ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ముంజల బిక్షపతి గౌడ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమ్మక్క సారక్క వన దేవతల సన్నిధి నుండి ములుగు వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. గద్వాల్ కు జోగులాంబ అని, వేములవాడకు రాజన్న సిరిసిల్ల అని, కొత్తగూడెంకు భద్రాద్రి అని, భువనగిరికి యాదాద్రి అని, భూపాలపల్లి బొందలగడ్డకు జయశంకర్ అని ఈ విధంగా దేవతల పేర్లు, మహనీయుల పేర్లు పెట్టారని గుర్తు చేశారు.

ఈ క్రమంలో ఎంతో చరిత్ర, మహిమ గల సమ్మక్క-సారలమ్మ ఉన్న ములుగు జిల్లాకు కూడా సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలో అతి పెద్ద మహా జాతర సమ్మక్క సారక్క మహా జాతర, మహా కుంభమేళ మేడారానికి జాతీయ హోదా కల్పించాలని, మేడారంను మండలం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి మడిపల్లి శ్యాంబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మధు బలరాం, సుదర్శన్, రాంబాబు, తదితర నాయకులు, కుల సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పస్రా గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -