Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌తోనే ములుగు అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే ములుగు అభివృద్ధి

- Advertisement -

మంత్రి సీతక్క

నవతెలంగాణ – ములుగు
కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ములుగు అభివృద్ధి జరుగుతోందని, అన్ని వార్డుల్లో కాంగ్రెస్‌ కౌన్సిలర్లను గెలిపించాలనీ, అభివృద్ధి చేసే బాధ్యత నాదని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఎన్నికల ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. ములుగు అభివృద్ధిలో వెలగాలంటే 20 వార్డులలోని కౌన్సిలర్లను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన గత పాలకులు ములుగు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని మొట్టమొదటిసారిగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ములుగు ప్రజలందరూ అన్ని డివిజన్లని గెలిపించాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవి మనదైతే అభివృద్ధిలో మార్పు తీసుకు రాగలమని అన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేగ కళ్యాణి, 9వ వార్డు అభ్యర్థి వేల్పురి శ్రావణి భరత్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్‌ గౌడ్‌, బొచ్చు సమ్మయ్య సుజాత, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -