నవతెలంగాణ – మల్హర్ రావు(మహా ముత్తారం)
మహముత్తారం మండలం ములుగు పల్లి ఉన్నత పాఠశాల నూతన ప్రధానోపాధ్యాయుడుగా కైరిక సాంబశివరావు శుక్రవారం విధుల్లో చేరారు. ఈ మేరకు హజరు పట్టికలో సంతకం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులుతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ములుగుపల్లి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు నూతన ప్రధానోపాధ్యాయులు సాంబ శివ రావును పూల బొకేలు, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాపాధ్యాయులు దాసరి రాజేంద్ర ప్రసాద్,ఉపాధ్యాయులు అనిల్ నాయక్, కామిడి సతీష్ రేడ్డి, సుంకు చంద్ర కళ, పెనుకుల యాదగిరి,గొంతి సుధాకర్ రెడ్డి, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొంకల గీతా రేడ్డి, నాగరాజు సంపంగి, సదయ్య పాల్గొన్నారు.
ములుగుపల్లి ఉన్నత పాఠశాల హెచ్ ఎంగా సాంబశివరావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES