- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 2025 సంవత్సరానికి గాను ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా భారత వాణిజ్య రాజధాని నగరం ముంబై(Mumbai) టాప్‌లో నిలిచింది. టైమ్ అవుట్ నిర్వహించిన కొత్త సర్వే ప్రకారం, ముంబై తర్వాత చైనా రాజధాని నగరం బీజింగ్, షాంఘై వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. సంస్కృతి, ఆహారం నైట్ లైఫ్, మొత్తం జీవన నాణ్యతతో సహా అనేక అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
టైమ్ అవుట్ సర్వే ప్రకారం 2025కి ఆసియాలోని టాప్ 10 సంతోషకరమైన నగరాలు
- ముంబై, భారతదేశం
- బీజింగ్, చైనా
- షాంఘై, చైనా
- చియాంగ్ మై, థాయిలాండ్
- హనోయ్, వియత్నాం
- జకార్తా, ఇండోనేషియా
- హాంకాంగ్
- బ్యాంకాక్, థాయిలాండ్
- సింగపూర్
- సియోల్, దక్షిణ కొరియా
- Advertisement -



