– చెన్నై బ్లిట్జ్‌పై 3-1తో గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్ :
ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్‌లో ముంబయి మీటియర్స్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌పై 16-14, 11-15, 15-12, 21-19తో ముంబయి మీటియర్స్ గెలుపొందింది. నాలుగు సెట్ల మ్యాచ్‌లో పైచేయి సాధించిన ముంబయి.. సీజన్లో ఐదో విజయంతో టాప్-4లో చోటు ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 9-15, 13-15, 15-9, 13-15తో కోల్‌కత థండర్‌బోల్ట్స్ చేతిలో ఓటమి పాలై సెమీస్ ఆశలు ఆవిరి చేసుకుంది. కొచ్చి బ్లూ స్పైకర్స్ చేతిలో 13-15, 16-14, 15-17, 9-15తో ఓటమి చెందినా.. అహ్మదాబాద్ డిఫెండర్స్ సెమీఫైనల్‌కు చేరుకుంది.
సెమీస్‌కు ముంబయి
- Advertisement -
- Advertisement -