Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ బాలమణి

పదవి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్ బాలమణి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్లు ఒకటో వార్డు కోమల్ల మౌనిక హరీష్, మూడో వార్డు కౌన్సిలర్ యాట శివ, నాలుగో వార్డు కౌన్సిలర్ బీజనా కళ్యాణి మధు, బీజేపీకి చెందిన కౌన్సిలర్లు ఐదో వార్డు పాశికంటి సంపత్, 8వ వార్డు కౌన్సిలర్ బొట్ల సంపత్ లని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి  కౌన్సిలర్లుగా పదవి ప్రమాణ స్వీకారం చేయించారు.  చైర్మన్  బీజన బాలమణి పదవి ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లను శాలువా పూలమాలతో పలువురు ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు,  మేనేజర్ జగన్మోహన్,కౌన్సిలర్లు మరియమ్మ, పస్తం అంజనేయులు, మల్లెల సరిత శ్రీకాంత్, జూకంటి సంపత్, జట్ట నీరజ సిద్ధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -